Wednesday, January 22, 2025

అది భస్మాసుర హస్తం

- Advertisement -
- Advertisement -

సర్వ అనర్థాలకు కాంగ్రెస్సే కారణం..

కాంగ్రెస్ హయాంలో పడ్డ కష్టాలు మరవద్దు

ప్రజా ఆశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్ పిలుపు

దళితుల అభివృద్ధికి నిరంతర కృషి
నియోజవర్గ అభివృద్ధిని కాంక్షించే భాస్కర్‌రావును గెలిపించండి

మన తెలంగాణ/మిర్యాలగూడ : ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న వారిని గెలిపించి ప్రోత్సహించాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఎన్‌ఎస్పీ క్యాంపుగ్రౌండ్‌లో ప్రజాఆశీర్వాద సభ బిఆర్‌ఎస్ ఎమ్మె ల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగింది. సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ నేను చెప్పే మాటలు దళిత బిడ్డలు, దళిత మేధవులు ఆలోచన చేయాలి. యుగయుగాలు తరతరాలుగా దళిత జాతి అణచివేతకు గురువుతుందని వాళ్లకు ఎమోషన్స్ లేవా.. ప్రేమలు లేవా… ఎందుకింత అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చెందా రు. ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఉంటే వారి దరిద్రం తీరేదని, కానీ ఏ నాయకుడు ఏ ప్రభుత్వం చేయలేదని అన్నారు.

దళిత బంధు పథకం పుట్టించిందే కెసిఆర్ అని దళితుల్లో ఆత్మవిశ్వాసం రావాలని కంకణం కట్టుకుని దశలవారీగా అయినా సరే ఇంటికి రూ.10లక్షలు దళిత బంధు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకువచ్చామని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ విషయం దళిత సమాజం ఆలోచన చేయాలని, ఇలా చేసేవారిని ప్రోత్సహించాలని, గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈసారి వర్షాలు పడక కొం త ఇబ్బందులు ఎదురయ్యాని, గోదావరి నీటిని నల్లగొం డ ఉదయ సముద్రం నుంచి నాగార్జున సాగర్ నియోజకవర్గ పెద్ద దేవులనల్లి రిజర్వాయర్‌కు మళ్లించే ప్రణాళికలలు సిద్ధం చేశామని, వాటిని పూర్తి చేస్తామని దీంతో సాగునీటి కష్టాలు తీరుతాయని సిఎం కెసిఆర్ తెలిపారు. గెలిపిస్తే ఇంకా చేయాలనిపిస్తుందని అన్నారు. గతంలో బ్యాంకుల్లో అప్పులు ఉంటే తలుపులు తీసుకుని పోతుండేవారని అప్పుడు ఏ ప్రభుత్వం కూడా వారిని ఆపలేదని గుర్తు చేశారు. రైతుల పరిస్థితిని మెరుగుపరచాలని ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఆలోచించలేదన్నారు. తెలంగాణ వ చ్చాక గ్రామాలు, పల్లెలు కళకళలాడించాలని పచ్చదనం ఎట్లా ఉండాలని ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్ణయించామని తెలిపారు. మిషన్ భగీరథ, కరెంటు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. భాస్కర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే భాస్కర్‌రావు కోరిన కోర్కెలు నెరవేరుస్తానన్నారు.

మంచి పనుల కోసం పరితపించే నాయకుడు ఎప్పుడు ఉన్నా వారిని గెలిపించాలని అన్నారు. ఇవ్వాళ సమస్యలన్ని తీర్చుకుని ముందుకెళుతున్నామని, తెలంగాణ తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో నెంబర్‌వన్‌గా ఉందని, రాబోయే రెండేళ్లలో సాగునీటి బాధ తీరుతుందని అన్నారు. పేదలు, నిరుపేద లు, రైతాంగం బాగుకోసం ముందుకు వెళుతున్న ప్రయా ణం ముందుకుసాగాలని అన్నారు. మంచి నాయకుడిని గెలిపించుకుని అభివృధ్దిని కొనసాగిద్దామన్నారు. ఈ కా ర్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చ య్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, జిల్లా కోఆప్షన్ నెంబర్ మోసిన్ అలీ, ఎన్‌బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ, చైతన్య, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు , తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News