Monday, December 23, 2024

హార్దిక్ టెస్టుల్లో ఆడడం కష్టమే

- Advertisement -
- Advertisement -

మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్
కాన్పూర్: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య భవిష్యత్తులో టెస్టు క్రికెట్ ఆడడం చాలా కష్టంతో కూడుకున్న అంశమని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. హార్దిక్ ఫిట్‌నెస్‌ను గమనిస్తే అతను సాంప్రదాయ టెస్టు క్రికెట్ ఆడే పరిస్థితుల్లో లేడన్నాడు. ఇలాంటి స్థితిలో హార్దిక్‌కు టెస్టు జట్టులో స్థానం లభిస్తుందని తాను భావించడం లేదని పేర్కొన్నాడు. హార్దిక్ వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సేవలు టీమిండియాకు చాలా అవసరమన్నాడు. కానీ కొంత కాలంగా వరుస గాయాలతో సతమతమవుతున్న హార్దిక్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంలో విఫలమవుతున్నాడన్నాడు. ఈ పరిస్థితుల్లో హార్దిక్‌ను టెస్టుల్లో ఆడించే సాహసం జట్టు యాజమాన్యం చేస్తుందని తాను భావించడం లేదన్నాడు. తన దృష్టిలో హార్దిక్ మళ్లీ టెస్టు క్రికెట్ ఆడడం శక్తికి మించిన పనేనని కార్తీక్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News