Monday, December 23, 2024

పంత్ క్రికెట్‌ మర్చిపోవాల్సిందేనా!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఇప్పట్లో కోలుకోవడం కష్టంతో కూడుకున్న అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌కు వెళ్లే క్రమంలో పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను డెహ్రూడూన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న విషయం తెలిసిందే. ఇక పంత్‌ను మెరుగైన చికిత్స కోసం రాజధాని ఢిల్లీ లేదా ముంబైకి తరలించే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే రోడ్డు ప్రమాదంలో తృటిలో ప్రాణాలతో బయటపడిన పంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే అతనికి శరీరంలోని పలు చోట్లు తీవ్ర గాయాలయ్యాయి.

గాయాల తీవ్రత అధికంగా ఉండడంతో పంత్ సమీప భవిష్యత్తులో క్రికెట్ బరిలోకి దిగడం కష్టంగానే కనిపిస్తోంది. ఆరు నెలల నుంచి ఏడాది పాటు అతను క్రికెట్‌కు దూరంగా ఉండే పరిస్థితి నెలకొంది. ఆస్ట్రేలియాతో జనవరిలో జరిగే టెస్టు సిరీస్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఐపిఎల్‌కు కూడా పంత్ దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపిఎల్‌లో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కిందటి సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ గాయం బారిన పడడంతో పంత్‌కు ఢిల్లీ కెప్టెన్సీ దక్కింది. ఈసారి కూడా అతనే జట్టుకు సారథ్యం వహించాల్సి ఉంది. కానీ పంత్ రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో అతను చాలా రోజుల పాటు క్రికెట్‌కు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఐపిఎల్‌తో పాటు మరికొన్ని సిరీస్‌లకు పంత్ దూరంగా ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్ నాటికి పంత్ పూర్తిగా కోలుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News