Wednesday, January 22, 2025

వారి స్థానాలను భర్తీ చేయడం కష్టమే

- Advertisement -
- Advertisement -

మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఇద్దరు దిగ్గజాల స్థానాలను ఎవరూ భర్తీ చేస్తారనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పలువురు మాజీ క్రికెటర్లు ఈ అంశంపై తమదైన శైలీలో స్పందిస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ కూడా దీనిపై స్పందించాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేశారన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ వీరు సత్తా చాటారన్నారు.

రోహిత్‌తో పోల్చితే కోహ్లి కాస్త పైచేయిగా ఉన్నాడన్నాడు. అయితే వన్డే, టి20 ఫార్మాట్‌లలో రోహిత్ శర్మకు ఉన్న కళ్లు చెదిరే రికార్డు ముందు కోహ్లి తేలిపోతాడన్నాడు. అయినా టెస్టులతో పాటు వన్డేలు, టి20లలో కోహ్లి అసాధారణ ఆటతో అలరించడన్నాడు. మరి కొన్నేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే సత్తా వీరికి ఉందన్నాడు. అయితే టి20 ఫార్మాట్‌కు ఇద్దరు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం భారత క్రికెట్‌కు నష్టమేనన్నాడు.

వీరి స్థానాలను భర్తీ చేయడం అనుకున్నంత తేలిక కాదన్నాడు. ప్రస్తుతం భారత జట్టులో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదన్నాడు. అయితే కోహ్లి, రోహిత్‌లతో పోల్చితే వీరికి ఉన్న అనుభవం చాలా తక్కువన్నాడు. వీరు మెరుగైన ఆటగాళ్లుగా ఎదిగేందుకు మరికొంత సమయం పడుతుందన్నాడు. ఇలాంటి స్థితిలో రోహిత్, కోహ్లిలు లేని లోటు టీమిండియాపై స్పష్టంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని కపిల్‌దేవ్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News