Monday, December 23, 2024

ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం తగదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/స్టేషన్ ఘన్‌పూర్: కొంత మంది ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని రండ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం ధర్మసాగర్ మండలంలోని కరుణాపురంలో నిర్వహించిన ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే మానసికంగా దెబ్బకొట్టేందుకు లేనిపోని ఆరోపణలను కొంత మంది చేయిస్తున్నారన్నారు.

ఆడోళ్లను అడ్డుపెట్టుకొని రండ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన నవ్య ఆరోపణలను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను మహిళల హక్కుల కోసం, వారి సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యమిచ్చిన వాడినన్నారు. తనకున్న ప్రజాధరణను చూసి ఓర్వలేకనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఐదోసారి కూడా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలపై మాట్లాడుతూ పలుమార్లు భావోద్వేగానికి గురై ప్రసంగిస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. కావాలనే తనపై కుట్రలు చేస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News