Monday, December 23, 2024

కర్నాటక ప్రకటనలు తెలంగాణలో ఇవ్వడం సరికాదు

- Advertisement -
- Advertisement -

ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని సిఈవోను కోరిన జవదేకర్

మన తెలంగాణ/ హైదరాబాద్: ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో మరో రాష్ట్రం ప్రకటనలు ఇవ్వడం సబబు కాదని బిజెపి సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. శనివారం సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసి కర్నాటక ప్రకటనలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రకటనలు ఇవ్వవచ్చు కానీ, కర్నాటక ప్రభుత్వం అక్కడి ప్రజల డబ్బుతో తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధుమన్నారు.

కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం లేదని, కర్నాటక ప్రజల డబ్బుతో తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనని, బెంగళూరు నగర అభివృద్ధికి నిధులు లేవని డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆపార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు అమ్ముడు పోతారని ఎద్దేవా చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News