Sunday, December 22, 2024

బాయిల్డ్ రైస్ కొనలేం

- Advertisement -
- Advertisement -

It is not possible to buy boiled rice

 

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయటం సాధ్యం కాదని కేంద్ర ఆహార పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఎఫ్‌సిఐ దగ్గర ఇప్పటికే 40లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ నిలువలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం విజ్ణప్తి మేరకు మరో 20లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించామన్నారు. ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎంఒయుపై సంతకం చేసిందని తెలిపారు. ధాన్యం సేకరణ అనేది అన్ని రాష్ట్రాల బాధ్యత అన్నారు. రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్రాలదే అన్నారు. పంజాబ్ నుంచి ఒక్క గింజ కూడా బాయిల్డ్ రైస్ తీసుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత ముడిబియ్యం ఇచ్చినా తీసుకుంటామని వెల్లడించారు. బియ్యం సేకరణలో ఏ రాష్ట్రంపైనా వివక్ష లేదన్నారు. ఏజెంట్‌గా మాత్రమే రాష్ట్రాలు ధాన్యాన్ని సేకరిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రా రైస్ ఇస్తుందని , తెలంగాణకు ఇబ్బందేమిటని ప్రశ్నించారు. బియ్యం సేకరణలో కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. బియ్యం సేకరణపై అన్ని రాష్ట్రాలను వివరాలు కోరామన్నారు. ముందుగా ఇచ్చిన సమాచారం మేరకే బియ్యం సేకరిస్తామని కేంద్ర ఆహార, పౌరసరఫరాల మంత్రిత్వశాఖ కార్యదర్శి సుధాంశు పాండే పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News