Friday, December 20, 2024

మోడీ చైనాకు లొంగిపోవడం సరికాదు !

- Advertisement -
- Advertisement -

సరిహద్దు వివాదంపై పార్లమెంటులో చర్చ జరగాలి: ఎంఐఎం అధినేత ఒవైసీ

మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కార్, ప్రధాని నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు. బ్రిక్స్ సదస్సులో మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య జరిగిన అనధికారిక సంభాషణ ఉద్దేశిస్తూ మోడీ ప్రభుత్వం చైనాకు లొంగిపోయిందని ఆరోపించారు. సరిహద్దు వివాదం దేశ భద్రతకు సంబంధించిన సమస్య అని ఇదేమీ మోడీ ఒక్కడికే చెందిన వ్యక్తిగత విషయం కాదని దీనిపై పార్లమెంట్ లో ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

చైనీయులకు భయపడకుండా మన భారత వీర సైనికులు 40 నెలల పాటు సరిహద్దుల్లో నిలబడ్డారని, కాపాడుతున్నారని అలాంటప్పుడు మోడీ ఎందుకు జిన్ పింగ్ ముందు దైర్యంగా ఉండలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. చైనా ముందు బిజెపి సర్కార్ ఎందుకు మెకరిల్లుతోందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. భారత్, చైనా మధ్య ఇప్పటివరకూ 19 సార్లు చర్చలు జరిగాయని ఆ చర్చల్లో ఏం మాట్లాడుకున్నారో దేశ ప్రజలకు చెప్పాలని కోరారు. లడఖ్‌లో ఏం జరుగుతుందో చెప్పకుండా కేంద్రం ఆసలు విషయాలు దాచిపెడుతోందని మండిపడ్డారు. ఆర్మీని ఒప్పందం కోసం ఎందుకు ఒత్తిడి చేస్తోందని చెప్పాలన్నారు. లడఖ్ సరిహద్దులో వాస్తవ పరిస్థితులపై దేశాన్ని అంధకారంలో ఉంచుతూ చైనా అధ్యక్షుడితో ప్రధాని సమావేశం అవ్వడం ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు.

సరిహద్దు వివాదాలపై భారత్ ద్వైపాక్షిక చర్చలు జరపాలని చైనా కోరుకుంటుందని బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని మోడీ, జిన్ పింగ్ మధ్య అనధికారిక చర్చ జరిగిందన్నారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు కొనసాగాలంటే, ఎల్‌ఓసి విషయంలో గౌరవంగా ఉంటాని మోదీ సూచించినట్లు తెలిసింది. కానీ ఒవైసీ మాత్రం ఈ భేటీని మోడీ ప్రభుత్వం చైనా ముందు లొంగిపోయినట్లు అభివర్ణించారు. ఇదే సమయంలో భారతీయ సైనికులపై మోడీకి విశ్వాసం లేదా అని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News