Wednesday, January 22, 2025

కొలీజియం సిఫార్సులను పక్కనపెట్టడం సరికాదు

- Advertisement -
- Advertisement -

జడ్జిల కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు అసహనం

న్యూఢిల్లీ : జడ్జిల ఎంపికలో కేంద్ర ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని, ఇబ్బం దికరం అవుతోందని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. కొందరిని ఎంచుకుని నిర్ణీతంగా నియామకాలు జరుగుతున్నాయి. మ రికొందరి విషయంలో కావాలనే జా ప్యం జరుగుతోందని, ఇదేం పద్ధతి అని న్యాయమూర్తులు సంజయ్ కి షన్ కౌల్, సుధాంశు ధూలియాతో కూడిన ధ ర్మాసనం స్పందించింది. అత్యున్నత న్యాయస్థా నం సుప్రీంకోర్టుకు కొలీజియం సిఫార్సు చేసిన వారి పేర్లను పక్కకు పెడుతున్నారు. ఏరికోరి కేంద్రం నుంచి జడ్జిల పదవులను ఇతరులతో భర్తీ చేస్తున్నారని, ఇది పద్థతి కాదని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. జడ్జిల నియామక ప్రక్రియపై ఇప్పటి తీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది.

ఇక హైకోర్టుల జడ్జిల బదిలీల విషయంలో కూడా వాయిదాలకు దిగుతున్నారని ఆందో ళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ధోరణి ఈ విధంగానే సాగితే ఇక తాము అంటే కొలీజియం ఏదో ఒక నిర్ణయానికి రావల్సి ఉం టుంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరం అవుతుందని చుర కలు పెట్టారు. కొలిజీయం సిఫా ర్సు చేసిన వారిని న్యాయమూ ర్తులుగా నియమించడంలో జా ప్యం, జడ్జిల స్థానచలనం నిలిపివేతల అంశా న్ని ప్రస్తావిస్తూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇప్పుడు జరుగుతోన్న ఎంచుకుని, ఎంపిక చేసే పద్థతి మారాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. దీని వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతు న్నాయని పేర్కొంది. అటార్నీ జనరల్ ఆర్ వెం కటరమణి ఈ విషయాన్ని కేంద్రానికి తెలియ జేయాల్సి ఉంటుందని , స్పందన ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. లేకపోతే తమ తరువాతి నిర్ణయం ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News