Monday, January 20, 2025

పార్టీ మారడమంటే బట్టలు మార్చినంత సులభం కాదు

- Advertisement -
- Advertisement -
కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం ఆరాటం
మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి ట్విట్‌కు ఈటెల సమాధానం

హైదరాబాద్ : తెలంగాణ బిజెపిలో నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. రెండు రోజుల కితం బిజెపి సీనియర్ నేత జితేందర్‌రెడ్డి ఆపార్టీ నేతలపై ట్వీట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఈనేపథ్యంలో జితేందర్‌రెడ్టి ట్విట్‌పై శుక్రవారం మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ తాను బిజెపి పార్టీ వీడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పార్టీ మార్పుపై పదే పదే నాలాంటి నాయకుడిని ప్రశ్నించవద్దని, పార్టీలు మార్చుడంటే బట్టలు మార్చిన సులభం కాదన్నారు. వార్తలతో ప్రచారం చేసుకుంటే పార్టీ బలోపేతం కాదని, తొందరంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆరాట పడుతుందని ఎద్దేవా చేశారు. సిఎం కెసిఆర్ మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమని అభివృద్ది కోసం మాత్రమే కాదు తెలంగాణ తెచ్చుకుంది ఆత్మగౌరవం కోసమమన్నారు. సొంత నియోజకవర్గంలో ఉన్న వారిని కలవకపోవడంపై రోడ్డు కాదు మాకు కావాల్సింది గౌరవమని ప్రజలు అడుగుతున్నట్లు పేర్కొన్నారు.అన్ని పార్టీలతో కెసిఆర్ తన కోవర్టులను పెట్టుకున్నాడని, పార్టీలన్ని ఏకం కాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News