Monday, November 18, 2024

విద్యార్థులను గన్‌తో బెదిరించామన్నది నిజం కాదు

- Advertisement -
- Advertisement -
  • వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్

సుబేదారి: విద్యార్థులను గన్‌తో బెదిరించామన్నది నిజం కాదని వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ రంగనాథ్ మాట్లాడుతూ.. కేయూ వీసీ కళ్లలో ఆనందం చూసేందుకు నేను గన్ పెట్టి బెదిరించానని కేయూ విద్యార్థులు ఆరోపించడం నిజం కాదన్నారు. నేనే దగ్గరుండి కొట్టానని చెప్పడం సరికాదన్నారు. నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

కొంత మంది ఏబీవీపీ విద్యార్థులు వీసీ ఛాంబర్ డోర్ పగులగొట్టి కంప్యూటర్‌ను ధ్వంసం చేశారన్నారు. ఈ విద్యార్థులే ఫిబ్రవరి 28న బైరి నరేశ్‌పై దాడి చేశారన్నారు. వైద్య పరీక్షల బోగస్ సర్టిఫికెట్లు పెట్టారని ఆరోపించారు. తమను పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ ముందు చెప్పారు. పాత గాయాలు చూపి జడ్జిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఇలాంటి ఆరోపణలు మాకు కొత్త కాదన్నారు. కేయూలో చాలా సంఘాల ఉన్నా కొందరే ఇలా చేశారన్నారు.

చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోబోమని ముందే హెచ్చరించాం అయినా విద్యార్థులు పట్టించుకోవడం లేదన్నారు. కేయూలో తప్పులు జరిగితే చట్టం, కోర్టులో పోరాడవచ్చు కాని చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే ఎలా అన్నారు. కేయూ వీసీ రమేశ్ మాట్లాడుతూ.. కేయూ పీహెచ్‌సీ డి. కేటగిరి.2 అడ్మీషన్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. పారదర్శకంగా అడ్మీషన్ల ప్రక్రియ కొనసాగించాం.

దౌర్జన్యం చేస్తే పాలకవర్గం లొంగుతుందని కొందరు భావిస్తున్నారన్నారు. ప్రతిభ ఉన్న వారికే సీట్లు కేటాయించామన్నారు. మాకు కులం, మతంతో సంబంధం లేదన్నారు. రూల్స్‌కు అనుగుణంగానే సీట్లు కేటాయించామన్నారు. మొన్న డోర్లు తన్నుకుంటూ, అసభ్య పదజాలంతో నా ఛాంబర్‌కు వచ్చి కొందరు విద్యార్థులు గలాట చేశారు. అక్రమ మార్గంలో పీహెచ్‌డీ అడ్మీషన్లు పొందేందుకే ఇలా చేస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News