Saturday, November 23, 2024

పేదరికంలో పుట్టడం తప్పు కాదు పేదరికంతో చనిపోవడం తప్పు….

- Advertisement -
- Advertisement -

పేదరికంలో పుట్టడం తప్పు కాదు పేదరికంతో చనిపోవడం తప్పు: ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

It is not wrong born into poverty it is wrong to die in poverty

 

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్: పేదరికంలో పుట్టడం తప్పుకాదని పేదరికంతో చనిపోవడం తప్పు అని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 7 మంది దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడారు. గత పాలకులు ఓట్ల కోసమే ప్రజలను వాడుకున్నారని, వారి సంక్షేమానికి ఏనాడు కృషి చేయలేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి వర్గానికి ఏదో ఒక రూపకంగా న్యాయం చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తు పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళిత బంధు కార్యక్రమం ద్వారా దళితుల్లో పేదరికాన్ని రూపుమాపేందుకే ఈ దళిత బంధు ఫథకం రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ప్రజల తరపున కృతఙ్ఞతలు తెలిపారు. దళిత బంధు లబ్ధిదారులు ఒక్క వాహనంతో మొదలైన వారి ప్రయాణం రాబోయే రోజులలో సొంతంగా ఒక్కొక్క లబ్ధిదారుడు రెండు నుండి మూడు వాహనాలు కొనుగోలు చేసే స్థాయికి ఎదగాలని కోరారు. ఎంపికైన దళితబంధు లబ్ధిదారులకు అనుకున్న సమయంలోనే వాహనాలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతి, జిల్లా ఎస్సి,ఎస్టి వెల్ఫేర్ అధికారి రామ్‌లాల్, డిటిఓ ఎర్రిస్వామి, జెడ్పిటిసి శ్రీశైలం, మున్సిపల్ చైర్మెన్ కల్పన, వివిధ గ్రామాల సర్పంచులు, దళిత నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News