Friday, December 20, 2024

హైదరాబాద్‌లో జోరు వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. దీంతో పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచింది. రోడ్లపై వరదనీరు వల్ల వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. నగరంలోని ప్రధాన రోడ్లు, కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్, గచ్చిబౌలిలో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. రాయదుర్గం, కొండాపూర్ లో భారీగా వాహనాలు స్తంభించిపోయాయి. మ్యాన్ హోల్స్ మూసుకుపోయి రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది.

ట్రాఫిక్ పోలీసులు కొన్ని చోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ పై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ నీటమునిగిపోయింది. జిహెచ్ఎంసి అధికారులు చర్యలు తీసుకోవట్లేదని మండిపడుతున్నారు. కాగా ఇప్పటి జిహెచ్ఎంసి నగరంలో కురుస్తున్న వర్షాలపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News