Wednesday, January 22, 2025

బిజెపి బిసిని ముఖ్యమంత్రి చేస్తామనడం హస్యాస్పదం

- Advertisement -
- Advertisement -

అమిత్ షా మాటలు వింటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది
రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్

మన తెలంగాణ/ హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టడానికి నిరాకరించిన బిజెపి పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బిసి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటనలు చేస్తే ఎవరు నమ్మరని మండిపడ్డారు.

బిసి కులగణన చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నా కూడా కులగణన చేయమని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన బిజెపి బిసి ఓట్ల కోసం ఎన్నికల ముందు బిసి అంటూ ముసలి కన్నీరు కారుస్తుందన్నారు.మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్ కోట కల్పించని బిజెపి బిసి ముఖ్యమంత్రి అంటే ఎవరు నమ్మరని ఆ పార్టీ డిఎన్‌ఎలో బిసి వ్యతిరేకత ఉందని అలాంటి అమిత్ షా మాటలు వింటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News