Saturday, April 5, 2025

బిఆర్‌ఎస్ తొలి జాబితాలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధకరం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో మహిళలకు తక్కువ సంఖ్యలో సీట్లు ఇవ్వడంపై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు సిఎం కెసిఆర్ పాటించాలని మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ బిజెపినేని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ విడుదల చేసిన తొలి జాబితాతోనే బిజెపి గెలుపు మార్గాలు దొరికినట్లుగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కమలం పార్టీ విజయం సాధిస్తుందని గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కెసిఆర్ రెండు చోట్ల పోటీ చేయడం సరికాదని ఇతరులకు అవకాశం ఇవ్వాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News