Thursday, November 21, 2024

ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులను రెచ్చగొడ్తున బిఆర్‌ఎస్ నేతలు
ఎంఎల్‌సి బల్మూర్ వెంకట్

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మ్యానిఫెస్టో లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని ఎంఎల్‌సి బల్మూర్ వెంకట్ అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేస్తోందని ఆయనన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా హాల్ లో వెంకట్ విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని, అందుకే బిఆర్‌ఎస్ నాయకులు మాపై కుట్ర పూరిత, అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తొమ్మిది సంవత్సరాలు మహిళలు ఇబ్బంది పడినప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. లీగల్ పాయింట్స్ అంటూ రోస్టర్ విధానాన్ని తెరపైకి తెచ్చి నిరుద్యోగులను ఆయోమయానికి గురిచేస్తున్నారని ఆయన బిఆర్‌ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జిఓ నెం. 3 తో నిరుద్యోగులకు, మహిళలకు ఎలాంటి అన్యాయం జరగదని, జిఓ నెంబర్ 3 పై బహిరంగ చర్చ కు సిద్దమని, మీ ఇష్టం ధర్నా చౌక్ కు రమ్మంటే వస్తాను మీరు సిద్దమేనా అని ఆయన కవితనుద్దేశించి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మూడు రోజుల్లోనే టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళన చేశామని, జాబ్ కేలండర్ తొందరలోనే విడుదల చేస్తామని ఆయనన్నారు. గత ప్రభుత్వం లో నిరుద్యోగులకు,మహిళలకు మీరు చేసిన పనులపై మేము చర్చకు సిద్దమని ఆయనన్నారు. బిఆర్‌ఎస్‌లో మహిళ అంటే కవిత మాత్రమే కనిపించేదని, కాంగ్రెస్ పార్టీలో మహిళలంటే , సీతక్క, సురేఖ, దీపా దాస్ మున్షీ లాంటి అనేక మందికి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. మహిళలను, నిరుద్యోగులను ఎవరు మోసం చేశారో తేల్చుకుందాం రండని సవాలు చేశారు. నిరుద్యోగులను ,మహిళలను తప్పుదోవ పట్టించవద్దని హితువు పలికారు. మీ ప్రభుత్వం ధర్నా చౌక్ ని ఎత్తేసి ప్రజా సమస్యలను తెలుసుకొనివ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి సమస్య తెలుసుకుంటోందని, ప్రతి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తోందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News