సూర్యాపేట:దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిందే కా ంగ్రెస్ పార్టీ అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ శనివారం కోదాడ మండలం గుడిబండ రైతు వేదిక పరిధిలోని రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రైతాంగాన్ని ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని వారి పరిపాలనలో సాగు నీరు కాదు కదా, కనీసం తాగేందుకు కూడా నీళ్లు లేని దుస్థితి అని అన్నారు.
రైతులను గోస పె ట్టిన చరిత్ర కాంగ్రెస్‌దే అని, ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆ లోచన కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. రైతులతో పెట్టుకున్న వాళ్లకు డిపాజి ట్లు కూడా రావని, రైతులను వ్యతిరేకించే కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటు త గిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సాగు నీరు, నాణ్యమై న ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపధ్యంలోనే రైతులు మంచి పంటలు ప ండిస్తూ సుఖ సంతోషాలతో ఉన్నారని స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్ల కు మీటర్లు పెట్టాలంటున్న కాంగ్రెస్, బిజేపి లను బొంద్ద పెడతామని, ఉచిత విద్యుత్ ఎత్తివేతకు కుట్ర చేస్తున్న కాంగ్రెస్ పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రై తన్నలు ఆగ్రహ జ్వాలలో ఉన్నారని అన్నారు.
24 గంటలు కరెంటు ఇచ్చి సాగును సీఎం కేసీఆర్ పండుగగా మార్చితే, ఈ కాంగ్రెసోళ్లు రైతులు పొట్ట కొట్టాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ రైతుకు ఉచిత విద్యుత్ ఊపిరి లాంటిదని, అన్నదాత ఉసురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్ధికి తార్కాణమన్నారు. నిన్నటి దాకా ధరణి రద్దు రైతు బందు వద్దూ అంటూ వి ప్పటికే రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్, ఇప్పుడు ఏకంగా ఉచిత కరెంటును ఎత్తివేస్తామన్న తన క్రూరమైన ఆలోచనను బయటపెట్టు కు ందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి చింతాకవిత రాధారెడ్డి, జడ్పిటిసి కృష్ణకుమారి శేషు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అనంత సైదయ్య, వైస్ ఎంపిపి రాణి బ్రహ్మయ్య, సొసైటీ ఛైర్మన్ రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు ఎ ండి సలీం, ఉపాధ్యాక్షులు కందరబోయిన అప్పకొండలు, నాగశేషు, అంబేద్కర్, భిక్షం, ఖాజా, ఎరగాని గాంధీ, డీలర్ నాగయ్య, నవరత్నారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.