Monday, December 23, 2024

కాంగ్రెస్‌ను బొంద పెట్టేది రైతులే…

- Advertisement -
- Advertisement -
  • చంద్రబాబుకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది
  • మూడు గంటల కరెంట్ సరిపోతుంది అనే మాటలు కాంగ్రెస్ పార్టీవా, లేక రేవంత్ రెడ్డి నిర్ణయమా…
  • రైతు బంధు, రైతు బీమా ద్వారా 2 కోట్ల రూపాయల అందించి రైతులను ఆదుకున్న ఘనత బిఆర్‌ఎస్‌దే
  • రైతు వేడుకల్లో తీర్మానం కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

బెజ్జంకి: సీమాంధ్ర చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే కాంగ్రెస్ నడుస్తుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యాలు కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ సోమవారం బెజ్జంకి రైతు వేదికలో ఏర్పాటు చేసిన తీర్మానం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి పాల్గొని మాట్లాడారు. గతంలో వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడుని ప్రజలు బొంద పెట్టారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అదే గతి పడుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటు చేసుకోక ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుల పడ్డ కష్టాలను, ప్రజలకు ఆయా రైతు వేదికల ద్వారా వివరించాలని నాయకులకు సూచించారు.

3 గంటల కరెంట్ సరిపోతుందని అనే మాట రేవంత్ రెడ్డి నుండి వచ్చిందా, లేక కాంగ్రెస్ నుండ అని ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరానికి సాగు నీరు, 24 గంటల కరెంట్ అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్ర0 తెలంగాణ రాష్ట్రం అని కొనియాడారు. ఇప్పటివరకు మండలానికి 11 వేల మందికి గాను 125 కోట్ల రూపాయలు రైతు బంధు అందించినట్లు తెలిపారు. అలాగే మండలంలో రైతు బీమా ద్వారా 2కోట్ల రూపాయలు బాధిత కుటుంబాలకు అందించి ఆదుకున్నామన్నారు. మండలంలో మూడు పంటలకు సాగునీరు, 24 గంటల కరెంట్ రైతులకు అందిస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ , బిజెపి నాయకులు గ్రామాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్ గెలుస్తుందని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో ఎంపిపి నిర్మల, జడ్పిటిసి కవిత,మార్కెట్ కమిటీ చెర్మెన్ చెందకళ,పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి,రైతు సమన్వయ కమిటీ సభ్యులు సంపత్ రెడ్డి,ఐలా పాపయ్య, శ్రీనివాస్,ఎఎంసి వైస్ ఛైర్మన్ లక్ష్మారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు శ్రీనివాస్ గుప్తా, లక్ష్మణ్, బోనగిరి శ్రీనివాస్,ఎలా శేఖర్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News