Monday, November 18, 2024

పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రజలది

- Advertisement -
- Advertisement -

కొడకండ్ల : కొడకండ్ల అభివృద్ధి తన బాధ్యత అని, బిఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకరావడం ప్రజల బాధ్యత అని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం కొడకండ్ల మండల కేంద్రంలో రూ.70లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి, రూ.15లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు. అదేవిధంగా శివరాత్రి ఇద్దయ్య స్మారకార్థం వారి కుటుంబం కొడకండ్ల గ్రామ పంచాయతీ డెడ్‌బాడీ ఫ్రీజర్‌ను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కొడకండ్లను రూ.100 కోట్లతో అభివృద్ధి చేశానని, కొడకండ్లలో మినీఈ టెక్స్‌టైల్ పార్కును మంత్రి కెటిఆర్‌తో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మన నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ రోహిత్‌సింగ్, డీసీసీబీ వైస్‌చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర గ్రామాల సర్పంచ్‌లు, వివిధ ప్రభుత్వ అధికారులు, ముఖ్య కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, మహిళా సంఘాలు, కొడకండ్ల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News