Thursday, January 23, 2025

విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:తెలంగాణ రాష్ట్రం విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రా మంలో మన ఊరు మన బడి కా ర్యక్రమం కింద పాఠశాలలో 22 లక్షల రూపాయలతో నిర్మాణమైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా విధానాన్ని మార్పు చేయడంలో భాగంగా అనేక గురుకుల పాఠశాలలు ప్రారంభించి పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందేలా చేశారన్నారు.

అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో అనేక మౌలిక వసతులు కల్పించి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గతంలో కన్నా అన్ని రకాల వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నా రు. విద్యార్ధులకు చక్కటి నాణ్యమైన భోజనం అందించిన ఘనత తమ ప్రభుత్వందే అన్నారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్షం చే యబడ్డ పాఠశాలల వసతులు, తరగతి గదుల సమస్యలను దాదాపు పరిష్కరి ంచామని ఇంకేమైనా మిగిలి ఉంటే వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు.

విద్యార్ధులు ప్రభుత్వం అందించే అన్ని రకాల సహాయ సహకారాలు పొందుతూ మంచి విద్యను అభ్యసించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వం అం దించే సౌకర్యాన్ని ప్రతి విద్యార్ధికి అందేలా కృషి చేసి నాణ్యమైన విద్యా భో ధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డి సిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, డిఈ ప్రభాకర్, వైస్ ఎంపిపి శ్రీశైలం యా దవ్, డిఈఓ అశోక్, తహశీల్దార్ రాంప్రసాద్, ఎంఈఓ లింగయ్య, ఎంపిడిఓ భీమ్‌సింగ్, సర్పంచ్ మామిడి వెంకన్న, ఎంపిటిసి కవిత, గానుబండ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డిలతో పాలు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News