Saturday, December 21, 2024

ప్రతి పక్షాలను దాడులతో అణిచివేత అప్రజాస్వామికం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : ప్రతి పక్ష పార్టీల నాయకులను కేంద్ర ప్రభుత్వం దాడుల పేరుతో అణిచివేయాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రేరేపితంతోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. బిఆర్‌ఎస్ నేతలది తెరచిన పుస్తకం లాంటి జీవితం అన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీలో రాకముందు ఉన్న వారి వ్యాపారాలకు అన్ని రకాల పన్నులను సకాలంలో చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. విచారణ సంస్థలను అడ్డం పెట్టుకోని దుర్మార్గంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. బిఆర్‌ఎస్ నాయకులు ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News