Monday, January 20, 2025

అమ్మవారికి బోనం ఎత్తటం ఎంతో అదృష్టం: జడ్పి చైర్మన్

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం మహాంకాళీ అమ్మవారి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా జిల్లా జడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాక్రిష్ణ శర్మ బోనం ఎత్తుకున్నారు. వైభవంగా నిర్వహిస్తున్న అమ్మవారి ఉత్సవాలకు హాజరైన జడ్పీచైర్మన్ అక్కడి మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు, ఇతర మహిళలతో కలసి బోనం తలపై పెట్టుకుని ఆలయానికి వచ్చి అమ్మ వారికి భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు కాలువ శ్రీధర్ రావు, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, భక్త మండలి సభ్యులతో కలిసి ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ పలు ఆలయాతో ఉన్న గజ్వేల్ పట్టణం ఆధ్యాత్మిక నిలయంగా మారిందని జిల్లా జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాక్రిష్ణ శర్మ అన్నారు.

మహంకాళీ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించిన వారికి అన్ని విధాలుగా శుభాలు కలుగుతాయని , లోక కల్యాణాన్ని కోరుకుంటూ మనం అమ్మవారిని పూజించాలని అన్నారు. అమ్మవారి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణతో భక్తులను ముగ్ధులను చేస్తున్నట్లుందన్నారు. ఇక్కడి వాతావరణం కూడా ఆధ్యాత్మిక శోభను తలపిస్తోందన్నారు. బోనాల సందర్భంగా తాను అమ్మవారిని దర్శించుకోవటం తనకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్,మున్సిపల్ కౌన్సిలర్లు బాలమణి శ్రీనివాస్ రెడ్డి,తలకొక్కుల భాగ్యలక్ష్మీదుర్గా ప్రసాద్‌తో పాటు పలువురు మహిళలు,కొండ పోచమ్మ ఆలయ కమిటీ డైరక్టర్ గోలి సంతోష్ ,కొమురవెల్లి శంకరయ్య, బిఆర్‌ఎస్ నాయకుడు నూనెకుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News