హైదరాబాద్: తెలంగాణలో ఐటి ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. 2022-23లో ఐటి ఎగుమతులు 31.4 శాతం పెరిగాయని ప్రశంసించారు. శాసన సభ వర్షాకాల సమావేశాల సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. స్టేబుల్ గవర్న్‌మెంట్… ఏబుల్ లీడర్‌షిప్ వల్లే ఇదంతా సాధ్యమవుతుందన్నారు. గురుగ్రామ్‌లో ఐటి పరిశ్రమలు నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో 1987లో మొట్టమొదటి ఐటి పరిశ్రమ వచ్చిందని, తెలంగాణ వచ్చేటప్పటికి మన ఐటి ఎగుమతులు రూ.56 వేల కోట్లు ఉన్నాయని, గతేడాదే మన ఐటి ఎగుమతులు రూ.57 వేల కోట్లకు చేరాయన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి పరిశ్రమ విస్తరిస్తోందని, దేశంలో మొత్తం సృష్టించిన టెక్నాలజీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణదే ఉందని కెటిఆర్ స్పష్టం చేశారు. ప్రముఖ ఐటి కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని, కొత రాష్ట్రం వచ్చాక ఆరు లక్షలకు పైగా ఐటి ఉద్యోగాలు వచ్చాయన్నారు. పట్టణాలు, నగరాలు ఎదగాలంటే పరిశ్రమలను ఆకర్షించాలని, ప్రతిచోటా అంతర్జాతీయ ప్రమాణాలు తట్టుకొని నిలబడాలన్నారు. తెలంగాణలో భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయని, కోకాపేటలో భూముల ధర రికార్డులు బద్ధలు కొట్టాయని కెటిఆర్ తెలియజేశారు.
Also Read: అవినీతి కథా చిత్రం