Sunday, January 19, 2025

ఐటి మేజర్ కాగ్నిజెంట్ 3500 ఉద్యోగులను తొలగిస్తోంది!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: 2023లో ఆదాయాలు మందగించడంతో 3500 ఉద్యోగులను లేక దాదాపు 1శాతం ఉద్యోగులను(ప్రధానంగా నాన్‌బిల్లేబుల్) తొలగించనున్నట్లు ఐటి మేజర్ కాగ్నిజెంట్ గురువారం తెలిపింది. దేశంలోని పెద్ద నగరాల్లో 80000 సీట్లు, 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం తొలగించడం ద్వారా కంపెనీ తన రియల్ ఎస్టేట్ ఖర్చులను కూడా తగ్గించుకోబోతోంది.
కాగ్నిజెంట్ తన ఆపరేటింగ్ మోడల్‌ను సరళీకృతం చేయడం, కార్పొరేట్ ఫంక్షన్‌లను ఆప్టిమైజ్ చేయడం, పోస్ట్‌పాండమిక్ హైబ్రిడ్ వర్క్ ఎన్విరాన్‌మెంట్‌ను ప్రతిబింబించేలా కార్యాలయ స్థలాన్ని ఏకీకృతం చేయడం, మార్చడం లక్షంగా ‘నెక్స్ ట్ జెన్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ‘ఈ ప్రోగ్రామ్ యొక్క సిబ్బందిసంబంధిత చర్యలు సుమారు 3500 మంది ఉద్యోగులు లేదా వర్క్‌ఫోర్స్‌లో సుమారు 1 శాతం మందిపై ప్రభావం చూపుతుందని మేము ఆశిస్తున్నాము’ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

కంపెనీ ప్రకారం తొలి త్రైమాసికం ముగింపులో మొత్తం ఉద్యోగుల సంఖ్య 351500, మునుపటి త్రైమాసికం 2022 నుండి 3800 తగ్గుదల, 2022 తొలి త్రైమాసికం నుండి 11000 పెరిగింది. కాగ్నిజెంట్ నికర లాభం 2023 ఆర్థిక సంవత్సరపు మార్చి త్రైమాసికంలో 3 శాతం(సంవత్సరానికి), అంటే 580 మిలియన్ల డాలర్లకు పెరిగింది. కంపెనీ 4.8 బిలయన్ డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. ఇది 2023 తొలి త్రైమాసికంలో సంత్సరానికి 0.3 శాతం క్షీణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News