Thursday, January 23, 2025

కెటిఆర్‌కు ఐటి శాఖ మంత్రి పదవి ఇవ్వండి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు, బిఆర్‌ఎస్ పార్టీ 39 స్థానాలలో గెలుపొందాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఐటి శాఖ మంత్రి ఎవరు అనే దాని చర్చ జరుగుతోంది. గత తొమ్మిది సంవత్సరాల నుంచి కెటిఆర్ ఐటి శాఖ మంత్రిగా అద్భుతంగా పని చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కెటిఆర్‌ను ఐటి శాఖ మంత్రిగా తీసుకుంటే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు. సైబరాబాద్‌ను కెటిఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారని ప్రశంసించారు. సోషల్ మీడియాలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ ఐటి శాఖ మంత్రి ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఐటి శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ట్విట్టర్‌లో ఐటి మినిస్టర్ అనే పదం ట్రెండింగ్‌లో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News