Monday, December 23, 2024

కాంగ్రెస్‌కు ఐటి నోటీస్… అన్ని పార్టీలకు హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి
పార్టీల నాశనం బిజెపి ధ్యేయం
కాంగ్రెస్ నేత చిదంబరం
పుదుక్కోట్టై (తమిళనాడు) : రూ.135 కోట్ల జరిమానా విధిస్తూ కాంగ్రెస్‌కు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ నోటీస్ జారీ చేయడం పార్టీలను నాశనం చేయాలన్న బిజెపి ఉద్దేశంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలకు కూడా ఒక హెచ్చరిక అని మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం శనివారం ఆరోపించారు. ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్‌కు ఐటి శాఖ నుంచి శుక్రవారం మరొక నోటీస్ అందింది. మరి రూ. 1823.08 కోట్లు చెల్లించాలని పార్టీని ఐటి శాఖ కోరింది. చిదంబరం పుదుక్కోట్టైలో విలేకరులతో మాట్లాడుతూ, ‘బిజెపి ఎలక్టొరల్ బాండ్ల ద్వారా రూ. 8250 కోట్లు పొందినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై రూ. 135 కోట్లు జరిమానా విధించింది.

అన్ని పార్టీలను నాశనం చేయాలని బిజెపి వాంఛిస్తున్నదనేందుకు రాజకీయ పార్టీలకు, ప్రజలకు ఇది ఒక హెచ్చరిక’ అని అన్నారు. ఈ చర్య ద్వారా దేశంలో ఏకైక పార్టీగా ఉండిపోగలమని బిజెపి ఆశిస్తోందని ఆయన ఆరోపించారు.“ఒక దేశం ఒక ఎన్నిక’ అన్న ఆ పార్టీ అజెండా ‘ఒక దేశం, ఒక పార్టీ’ తప్ప మరేదీ కాదు. ఈ హెచ్చరిక ప్రతి ఒక్కరికీ’ అని చిదంబరం అన్నారు. ప్రజలు త్వరలోనే దీనిని గ్రహించగలరని ఆయన అన్నారు. చిదంబరం అంతకు ముందు జిల్లాలోని అరంతాంగిలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎఐఎడిఎంకె బిజెపి కూటమిలో చేరగలదని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News