Thursday, December 19, 2024

రాత్రంతా నా కొడుకుని కొట్టారు: మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఐటీ దాడుల్లో తన కుమారుడు మహేందర్ రెడ్డిని సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఐటీ అధికారులు కొట్టారని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఛాతిలో నొప్పి రావడంతో మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. బుధవారం ఆసుపత్రిని సందర్శించిన మంత్రి మల్లారెడ్డి.. తన కుమారుడిని కలవడానికి అధికారులు అనుమతించడం లేదని ఆరోపించారు.

మీడియాతో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఐటీ అధికారుల వెంట వచ్చిన సీఆర్పీఎఫ్ సిబ్బంది తన కొడుకును రాత్రంతా కొట్టారని, అందుకే ఆస్పత్రిలో చేరారని అన్నారు. వారు ఏదైనా అక్రమ వ్యాపారం చేస్తున్నామా లేదా కాసినోలు నడుపుతున్నామా లేదా స్మగ్లింగ్ చేస్తున్నామా అని ఆయన ప్రశ్నించారు. నామమాత్రపు ఛార్జీలతో విద్యార్థులకు విద్యను అందిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News