Monday, December 23, 2024

బిబిసి ఉద్యోగుల మొబైల్స్, లాప్‌ట్యాప్స్ తనిఖీ చేసిన ఐటి అధికారులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వరుసగా మూడవరోజు బిబిసికి చెందిన న్యూఢిల్లీ, ముంబై కార్యాలయాలలో సోదాలు కొనసాగిస్తున్న ఆదాయం పన్ను శాఖ(ఊటి) అధికారులు ఎడిటోరియల్, అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన ఉద్యోగుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను తనిఖీ చేసినట్లు వర్గాల ద్వారా తెలిసింది. మంగళవారం ప్రారంభమైన ఆకస్మిక సోదాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. కొందరు ఐటి అధికారులు రాత్రుళ్లు అక్కడే పడుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన అనంతరం కొందరు బిబిసి ఉద్యోగులను సంస్థ ఆర్థిక వ్యవహారాలపై ఐటి అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తమ ల్యాప్‌టాప్‌లను ఓపెన్ చేసి ఇవ్వాలని, మొబైల్ ఫోన్లను ఇవ్వాలని అధికారులు కోరినట్లు బిబిసి ఉద్యోగులు కొందరు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News