Tuesday, November 5, 2024

సోయా ఉత్పత్తుల కంపెనీపై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

సోయా ఉత్పత్తుల కంపెనీపై ఐటి దాడులు
రూ. 450 కోట్ల అక్రమ ఆదాయం వెలికితీత
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్‌లో ఐటి సోదాలు

IT Raid on soybean products company in MP

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన సోయా ఉత్పత్తుల తయారీ సంస్థకు చెందిన కార్యాలయాలపై జరిగిన దాడులలో రూ.450 కోట్ల మేరకు అక్రమ ఆదాయం బయటపడింది. మధ్యప్రదేశ్‌లోని బెటుల్, సత్నాలతోపాటు మహారాష్ట్రలోని ముంబయి, సోలాపూర్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని సంస్థ కార్యాలయాలలో ఫిబ్రవరి 18-22 మధ్య ఐటి శాఖ సోదాలు నిర్వహించగా ఈ లెక్క చూపని ఆదాయం బయటపడినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సిబిడిటి) తెలిపింది. లాప్‌టాప్స్, హార్డ్ డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్ వంటి డిజిటల్ మీడియా రూపంలో విలువైన సమాచారం లభించిందని, వీటిని స్వాధీనం చేసుకున్నామని సిబిడిటి ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో రూ.450 కోట్ల మేర అక్రమ ఆదాయాన్ని గుర్తించామని సిబిడిటి తెలిపింది. బెటుల్‌లోని సంస్థ కార్యాలయంలో జరిపిన సోదాలలో రూ. 8 కోట్ల మేర లెక్క చూపలేని నగదు, రూ. 44 లక్షలకు పైగా వివిధ దేశాలకు చెందిన కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు సిబిడిటి తెలిపింది. ఈ సోదాలలో తొమ్మిది బ్యాంకు లాకర్లు కూడా లభించాయని తెలిపింది. కోల్‌కతాకు చెందిన సూట్‌కేస్ కంపెనీలలో భారీ ప్రీమియంతో రూ. 259 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు అక్రమ ఖాతాలను కంపెనీ సృష్టించిందని, ఈ సూట్‌కేస్ కంపెనీలేవీ సంబంధింత చిరునామాలలో పనిచేయడం లేవని, ఆ కంపెనీలను కాని, వాటి డైరెక్టర్లను కాని ఈ సంస్థ గుర్తించలేకపోయిందని సిబిడిటి తెలిపింది.

IT Raid on soybean products company in MP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News