Sunday, December 22, 2024

ఐటి అధికారులకు సహకరిస్తున్నాం: బిబిసి

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: న్యూఢిల్లీ, ముంబైలోని తమ సంస్థ కార్యాలయాలపై ఆదాయం పన్ను శాఖ జరుపుతున్న దాడులపై బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బిబిసి) మంగళవారం స్పందించింది. ఐటి అధికారులకు తమ సిబ్బంది సంపూర్ణ సహకారం అందచేస్తున్నారని బిబిసి తెలిపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని బిబిసి కార్యాలయాలలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటి అధికారులు న్యూఢిల్లీలో తెలిపారు.

కాగా..సాధ్యమైనంత త్వరలో ఈ పరిస్థితి సదుమణుగుతుందని ఆశిస్తున్నట్లు బిబిసి ట్వీట్ చేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బిబిసి రెండు భాగాలతో కూడిన డాక్యుమెంటరీని ఇటీవల ప్రసారం చేసిన నేపథ్యంలో బిబిసి కారక్యాలయాలపై ఐటి దాడులు జరగడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News