Thursday, December 19, 2024

మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐ.టి. సోదాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఈడి, ఐటి దాడులు కొనసాగుతున్నాయి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పాటు సినీ నిర్మాణ సంస్థలపై కూడా దాడులు జురుగుతున్నాయి. ఈ క్రమంలో సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఏకకాలంలో 15 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఈ సంస్థ గతంలో పుష్ప, శ్రీమంతుడు, సర్కార్ వారి పాట, రంగస్థలం, జనతా గ్యారేజ్ మూవీ లకు నిర్మాణ సంస్థగా పనిచేసింది. మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్, చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ తో వీరసింహారెడ్డి చిత్రాలను నిర్మిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News