- Advertisement -
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. యలాల మండలం జుక్కేపల్లి సమీపంలోని ఆర్‌బీఎల్ ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహించారు. అది కాంగ్రెస్ట్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి చెందినది కావడం గమనార్హం. ఫ్యాక్టరీతో పాటు ఆయన నివాసంలోనూ తనిఖీలు చేశారు. ఇటీవల చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ నివాసంతోపాటు కార్యాలయాల్లోనూ ఐటి, ఇడి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం విదితమే. వివేక్‌కు చెందిన కంపెనీ అకౌంట్‌లోని డబ్బు పెద్దమొత్తంలో ఓ సెక్యూరిటీ ఏజెన్సీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవడం, ఇడి సూచనమేరకు బ్యాంకు అధికారులు ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. అంతకుముందు హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో రూ.50 లక్షలు పట్టుబడ్డాయి.
- Advertisement -