Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో ఐటి సోదాల కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలో ఐటి సోదాలు కలకలం రేపా యి. ఓ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నా రన్న అభియోగంపై సోదాలు నిర్వహించినట్లు ఎసిబి స్పష్టం చేసింది. హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ నేత అందెల శ్రీరాములు యాదవ్ ఇంటితో పాటు ఆయన వ్యాపార భాగ స్వా మి సామంత్ రెడ్డి నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. వీరి నివాసాల్లో అణువణువును ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించి, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో నగదు స్వాధీనం చేసుకున్న ట్లు ఎలాంటి స్పష్టత రాలేదు.

ఐటీ అధికారులు ఏమీ వెల్లడించలేదు. అయితే, వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అందెల శ్రీరాములు ఆర్థిక లావా దేవీ ల్లో అవకతవకలకు సంబంధించిన వ్యవహారాలపై పలు కోణాల్లో ఐటి శాఖ అధికారులు ఆరా తీశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి నేత నివాసంలో ఐటి దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున మహేశ్వరం నుంచి శ్రీరాము లు పోటీ చేశారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతిలో 26 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News