Sunday, November 17, 2024

బిల్డర్లపై మరోసారి ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలో ఐటీ సోదాలు కొనసాగా యి.ఏకకాలంలో 30 చోట్ల ఐటి అధికారులు త నిఖీలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఐటి సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, జూబ్లీహిల్స్, రాయదుర్గం, చై తన్యపురి, మలక్‌పేట్, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కొల్లూరు, రాయదుర్గం ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు కొనసాగాయి చైతన్యపురిలో ని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయంలో సోదాలు చే పట్టారు. మలక్ పేట నియోజకవర్గానికి కాంగ్రె స్ నుంచి పోటీ చేసిన షేక్ అక్బర్ ఇంటిలో సో దాలు నిర్వహించారు. షేక్ అక్బర్‌కు చెందిన గూగి ప్రాపర్టీస్ కార్యాలయాల్లో ఐటి సోదాలు నిర్వహించారు. గూగి ప్రాపర్టీస్‌కు చెందిన 15 చోట్ల ఐటి సోదాలు నిర్వహించారు. దీని కోసం మొత్తం 40 టీమ్‌లు రంగంలోకి దిగాయి.

గు రువారం ఉదయమే దాడుల కోసం 40 టీమ్‌లు గా ఏర్పడి సోదాలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత బొప్పన అచ్యుతరావు, శ్రీనివాస్, అ నూప్ ఇంట్లో ఐటి అధికారులు గురువారం తెల్లవారు జాము నుంచే సోదాలు నిర్వహించారు. కొల్లూరు, రాయదుర్గంలో ఐటి అధికారుల సోదాలు కొనసాగాయి. రాయదుర్గంలోని అన్విత బిల్డర్స్ ప్రధాన కార్యాలయంలో ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. జి స్కేర్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని ఆరో అంతస్తులో అన్విత బిల్డర్‌కు సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉంది. ఇతరులను సిఆర్‌పిఎఫ్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. సింగపూర్, దుబాయ్‌లలో ఇంటీరియల్ వ్యాపారం చేస్తున్న బొప్పన కుటుంబ సభ్యులు, విదేశాల నుండి అన్విత బిల్డర్స్‌కు భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులను ఐటి అధికారులు గుర్తించారు.

మనీలాండరింగ్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు ఐటి గుర్తించింది. ఇక, ఇటీవలే కొల్లూరులో ఫ్రీలాంచ్ ఆఫర్‌ను కూడా అన్విత బిల్డర్స్ ప్రకటించింది. ఇక ఐటి చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఐటి అధికారులు గుర్తించారు. హైదరాబా ద్‌లో ఐటి అధికారులు సెప్టెంబరులో 23న విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం విదితమే. కూకట్‌పల్లి సమీపంలోని మూసాపేట్ రెయిన్ బో విస్టాస్ అపార్ట్‌మెం ట్‌లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం ఎనిమిది మంది అధికారులు పాల్గొన్నారు. అపార్ట్‌మెంట్ లోని ‘ఐ బ్లాక్ ’లో అద్దెకు ఉంటున్న ఓ న్యూస్ ఛానెల్ యజమాని ఇంట్లో సోదాలు నిర్వహించారు. విజయవాడకు చెందిన రియల్టర్లపై ఐటి సోదాలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News