Monday, December 23, 2024

నారాయణపేటలో ఐటీ దాడులు..

- Advertisement -
- Advertisement -

నారాయణపేట జిల్లాలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టింది.స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఇంట్లో ఐటి అధికారులు తనిఖీలు చేపట్టారు. డిగ్రీ కాలేజ్ మాజీ ప్రిన్స్ పల్ సుదర్శన్ రెడ్డి, బంగారం వ్యాపారులు హరినారాయణ భట్టాడ్, బన్సీలాల్ లాహోటి నివాసాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

కాగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐటీ అధికారులు ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతోపాటు అనుచరుల ఇళ్ల్లపై ఐటీ దాడులు జరిగుతున్నాయి. అయితే, ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థులు, వారి బంధువులపై ఇళ్లపైనే ఐటీ దాడులు జరుగుతుండంతో.. ఇదంతా బీఆర్ఎస్, మోడీ కలిసే చేస్తున్నారని, కాంగ్రెస్ ను గెలవకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న్లట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News