Friday, November 15, 2024

వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్‌పై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

IT Raids in Vasavi Real Estate Group in Telangana

వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్‌పై ఐటి దాడులు
తెలుగు రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో 40 బృందాల సోదాలు
ఆదాయం,పన్ను చెల్లింపులపై ఆరా..!
తనిఖీలలో కీలక పత్రాలు, డాక్యూమెంట్ల స్వాధీనం
వాసవీ గ్రూప్స్‌లో పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్‌పై బుధవారం తెల్లవారు జామున 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. ఈక్రమంలో ఎపి, తెలంగాణ రాష్ట్రాలలో 40కి పైగా ఐటి బృందాలు ఏకకాలంలో 20 చోట్ల సోదాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలలోని వాసవి కన్‌స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ప్రధాన కార్యాలయాల్లో 20 మంది ఐటి అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించాయి. వాసవీ గ్రూప్స్ వేలాది కోట్ల రూపాయల పనులు చేస్తూ ఇన్‌కం ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు కంపెనీ అక్రమ లావాదేవీలపై ఐటి అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా వాసవీ గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ సోదాల్లో సంస్థకు అక్రమాలకు సంబంధించి పలు కీలక ఫైళ్లను, సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వాసవి గ్రూప్‌లోని రియాలిటీ, నిర్మాణ్, ఇన్ఫ్రా, శ్రీముఖ సంస్థల్లోనూ సోదాలు చేపట్టిన అధికారులు వాసవి సంస్థల్లో ఇతర సంస్థల, పారిశ్రామిక వేత్తల పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో వాసవీ గ్రూప్స్ భారీగా నిర్మాణాలు చేస్తూ పన్నులు ఎగ్గొట్టినట్లు ఆరోపణల మేరకు హైద్రాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లోని వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంతోపాటుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయాలపై దాడులు జరిపారు. వాసవి గ్రూప్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, వాసవి నిర్మాణ్ సంస్థ డైరెక్టర్ ఎర్రం విజయ్ కుమార్‌తో పాటు ఇతర డైరెక్టర్ల ఇళ్ళు, అలాగే సంస్థ ప్రధాన కార్యాలయం, అనుబంధ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోధాలు నిర్వహించింది.
ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య వ్యత్యాసం
వాసవి గ్రూప్, తమకు వస్తున్న ఆదాయానికీ, చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకీ మధ్య వ్యత్యాసాల్ని ఆదాయపు పన్ను శాఖ గుర్తించి కేసు నమోదు చేయడంతో పాటు ఏకకాలంలో తెలుగు రాష్ట్రాలలో సోదాలు నిర్వహించినట్లు ఐటి అధికారులు వెల్లడించారు. వాస్తవ ఆదాయాన్ని సంస్థ చూపడంలేదన్నది ఆరోపణల మేరకు దాడులు నిర్వహించామని, వాసవి గ్రూపుకి సంబంధించి అత్యంత విలువైన పత్రాలు అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నామని ఐటి అధికారులు వివరిస్తున్నారు. వాసవీ గ్రూప్ భారీగా నిర్మాణాలు చేపడుతూ రెండేళ్లుగా పన్నులు ఎగవేసిందని, 2020 నుంచి ఈ గ్రూప్ సంస్థల ఐటి రిటన్స్‌లో భారీ తేడాలు ఉన్నట్లు ఐటి అధికారుల విచారణలో తేలింది.
మరో రియల్ ఎస్టేట్ కంపెనీపై ః
నగరంలోని మరో రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. ఈక్రమంలో సుముధర ఇండియా లిమిటెడ్ కంపెనీలో సోదాలు చేపట్టిన అధికారులు టాలెస్ట్ టవర్ పేరుతో భారీగా వ్యాపారం చేసినట్లు గుర్తించారు. సుముధర సంస్థకు చెందిన హైదరాబాద్, బెంగళూరులలో ఐటి అధికారులు నిర్వహించి వాసవి, సుముధర కలిసి భారీ వెంచర్లు పూర్తిచేసినట్లు గుర్తించారు. ముఖ్యంగా టాలెస్ట్ టవర్ పేరుతో భారీగా వ్యాపారం చేసిన సుముధర సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటి అధికారుల విచారణలో తేలింది.

IT Raids in Vasavi Real Estate Group in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News