Thursday, December 19, 2024

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, గుంటూరు, వైజాగ్ లో ఐటి దాడులు కొనసాగుతున్నాయి. వసుధ గ్రూపు సంస్థల కార్యాలయాల్లో ఐటీ దాడులు చేస్తోంది. ఏకకాలంలో 40 చోట్ల ఐటి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వసుధ గ్రూపు సంస్థ సిఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్ లోని ప్రధాన కార్యాలయంతో పాటు మాదాపూర్, జీడిమేట్ల లోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 30కిపైగా బృందాలుగా విడిపోయి ఐటి అధికారులు దాడులు చేస్తున్నారు. వసుధ ఫార్మా చైర్మెన్ రాజు వసుధ ఫార్మా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. 15 కంపెనీల పేరుతో రాజు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News