Tuesday, November 5, 2024

చెన్నైలో 2 ప్రైవేట్ ఫైనాన్సింగ్ సంస్థలపై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -
IT Raids on 2 private financing companies in Chennai
రూ. 300 కోట్ల మేర నల్ల ధనం గుర్తింపు

చెన్నై: రెండు ప్రైవేట్ సిండికేట్ ఫైనాన్సింగ్ గ్రూపులకు చెందిన చెన్నైలోని కార్యాలయాలపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేయగా రూ. 300 కోట్లకు పైగా లెక్కల్లో చూపని అక్రమ ఆదాయం లభించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సిబిడిటి) శనివారం వెల్లడించింది. ఈనెల 23న చెన్నైలోని 35 కార్యాలయాలపై ఐటి దాడులు జరిగినట్లు సిబిడిటి తెలిపింది. ఇప్పటి వరకు జరిగిన దాడులలో రూ. 300 కోట్ల లెక్కల్లో చూపని ఆదాయం కనుగొనడంతోపాటు రూ. 9 కోట్ల నగదు లభించినట్లు సిబిడిటి ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడులోని బడా కార్పొరేట్ కంపెనీలతోపాటు వ్యాపార సంస్థలకు ఈ రెండు గ్రూపులు రుణాలు అందచేశాయని, వీటిలో అధిక మొత్తం నగదు రూపంలో ఉందని తెలిపింది. అధిక వడ్డీ రేటుపై రుణాలు అందచేస్తున్న ఈ ఆర్థిక సంస్థలు వీటిలో కొంత భాగాన్ని లెక్కల్లో చూపడం లేదని కనుగొన్నట్లు సిబిడిటి తెలిపింది. రుణగ్రహీతల వడ్డీ చెల్లింపుల కోసం డమ్మీ బ్యాంకు ఖాతాలు తెరిచారని, ఈ ఆదాయాన్ని పన్ను లెక్కల్లో చూపించడం లేదని వివరించింది. ఈ లెక్కల్లో చూపని ఆదాయాన్ని మొండి బకాయిలుగా చూపుతున్నారని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News