Friday, December 20, 2024

బిబిసి ఢిల్లీ ఆఫీసుపై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బిబిసి) కార్యాలయంపై మంగళవారం ఆదాయం పన్ను శాఖ(ఐటి) దాడులు నిర్వహించింది. మంగళవారం ఉదయం బిబిసి కార్యాలయంపై హఠాత్తుగా దాడులు నిర్వహించిన ఐటి అధికారులు అక్కడి ఉద్యోగుల నుంచి వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని బయటకు పంపించివేశారు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లపై బిబిసి రెండు భాగాల డాక్యుమెంటరీని రూపొందించి ప్రసారం చేసిన తర్వాత ఆ సంస్థ కార్యాలయంపై ఐటి దాడులు నిర్వహించడం గమనార్హం.

అప్పటి అల్లర్లలో వేలాదిమంది మరనించగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో అత్యధికులు ముస్లింలే. కాగా.. ఈ అలర్లకు నరేంద్ర మోడీ నేరుగా బాధ్యుడని బిబిసి తన డాక్యుమెంటరీలో ఆరోపించింది. రాజకీయ దురుద్దేశంతో సృష్టించిన ఈ హింసాకాండ అసలు ఉద్దేశం హిందువుల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి ముస్లింలను తరిమివేయడమేనని బిబిసి ఆరోపించింది. అప్పటి మోడీ ప్రభుత్వం సృష్టించిన సానుకూల పరిస్థితుల వల్లే అల్లర్లు సాధ్యమయ్యాయని కూడా బిబిసి ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News