అధికార యంత్రాంగానికి సహకరిస్తామన్న షియోమీ, ఒప్పొ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చైనా మొబైల్ కంపెనీల కార్యాలయాల్లో ఆదాయం పన్ను(ఐటి) శాఖ దాడులు చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ముంబై, బెంగళూరు సహా పలు నగరాల్లో ఉదయం 9 గంటల నుంచి సోదాలు చేపట్టారు. చట్టం ప్రకారం, అధికార యంత్రాంగానికి సహకరిస్తామని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు షియోమీ, ఒప్పొ వంటి సంస్థ ప్రకటించాయి. ఒప్పొ గ్రూప్‌తో సంబంధం ఉన్న పలువురు సీనియర్ అధికారులు, డైరెక్టర్లు, సిఎఫ్‌ఒ, ఇతర అధికారులపై ఐటి శాఖ దాడులు నిర్వహించింది. ఒక నివేదిక ప్రకారం, దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రూ.2.5 లక్షల కోట్లు ఉంది. అయితే దీనిలో 70 శాతం వాటా చైనా కంపెనీలదే. ఇక దేశంలో టెలివిజన్ మార్కెట్ రూ.30,000 కోట్లు ఉండగా, దీనిలోనూ చైనా కంపెనీల స్మార్ట్ టీవీల వాటా 45 శాతం వరకు ఉంది. నాన్-స్మార్ట్ టీవీల వాటా 10 శాతంగా ఉంది.