Saturday, February 22, 2025

శివసేన మంత్రుల అనుచరుల ఇళ్లపై ఐటి దాడులు..

- Advertisement -
- Advertisement -

IT Raids on Close Aides houses of Shiv Sena ministers

ముంబైః మహారాష్ట్రలో శివసేన మంత్రుల అనుచరుల ఇళ్లపై ఐటి అధికారులు దాడి చేశారు. మంత్రులు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరాబ్ అనుచరుల ఇళ్లలో మంగళవారం ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. ముంబై, పూణెల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటి దాడులపై స్పందించిన శివసేన ఎంపి సంజయ్ రౌత్.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్ని రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలను కావాలనే టార్గెట్ చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఇలా దాడులు చేస్తున్నాయని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు.

IT Raids on Close Aides houses of Shiv Sena ministers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News