Thursday, December 19, 2024

ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇళ్లపై ఇడి దాడులు

- Advertisement -
- Advertisement -

IT Raids on Delhi Minister Satyendar Jain's House

న్యూఢిల్లీ: హవాలా లావాదేవీల ఆరోపణలకు సంబంధించి మనీ లాండరింగ్ దర్యాప్తును ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) సోమవారం దాడులు నిర్వహించింది. ఇప్పటికే అరెస్టయిన సత్యేంద్ర జైన్‌కు చెందిన ఢిల్లీ నివాసంతోపాటు ఇతర ప్రాంతాలలోని ఇళ్లు, కార్యాలయాలపై ఇడి అధికారులు దాడులు నిర్వహించి సోదాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. పిఎంఎల్‌ఎ చట్టం కింద మే 30న 57 ఏళ్ల జైన్‌ను ఇడి అరెస్టు చేసింది. జూన్ 9 వరకు ఆయన ఇడి కస్టడీలో ఉంటారు. కొత్త ఆధారాలు దొరకడంతో తాజా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

IT Raids on Delhi Minister Satyendar Jain’s House

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News