బెంగళూరు : పాప్యులర్ ఔషధం డోలో 650 తయారీ సంస్థ మైక్రోల్యాబ్స్ లిమిటెడ్‌పై ఐటీ శాఖ సోదాలు జరిపింది. బెంగళూరు లోని రేస్ కోర్సు రోడ్డు లోని ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జరిపిన ఈ దాడుల్లో కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే ఢిలీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవాలతోపాటు దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరపగా, 200 మందికి పైగా అధికారులు పాల్గొన్నట్టు ఐటీశాఖ వర్గాలు పేర్కొన్నాయి. మైక్రోల్యాబ్స్ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానా, నివాసాల్లోనూ సోదాలు జరిగాయి. 2020 లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఈ కంపెనీ రికార్డు స్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లను విక్రయించింది. అంతేకాకుండా ఒకే ఏడాదిలో దాదాపు రూ. 400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి అనేక కంపెనీలను అధిగమించింది.
డోలో-650 తయారీ సంస్థపై ఐటీ దాడులు..
- Advertisement -
- Advertisement -
- Advertisement -