Saturday, November 16, 2024

కెజిఎఫ్ బాబు ఇంటిపై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: సస్సెన్షన్‌కు గురైన కాంగ్రెస్ నాయకుడు యూసఫ్ షరీఫ్ అలియాస్ కెజిఎఫ్ బాబుకు చెందిన సెంట్రల్ బెంగళూరు నివాసంపై ఆదాయం పన్ను అధికారులు బుధవారం ఉదయం దాడులు జరిపారు. పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వసంత్‌నగర్‌లోని మిల్లర్స్ ట్యాంక్‌బండ్ రోడ్డులో ఉన్న కెజిఎఫ్ బాబు నివాసంలో ఉదయం 5.30 గంటల నుంచి ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.

Also Read: రహస్యంగా వివాహం చేసుకున్న ప్రముఖ నటి

మే 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో చిక్‌పేట్ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బాబు భార్య షజియా తరన్నుం పోటీ చేస్తున్న నేపథ్యంలో ఐటి దాడులు జరగడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌ను బాబు ఆశించినప్పటికీ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌వి దేవరాజ్‌ను బరిలోకి దించింది. దీంతో బాబు తన భార్యను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించడానికి చాలా రోజుల ముందు నుంచే బాబు చిక్‌పేట్ నియోజకవర్గంలో సామాజిక సేవ పేరుతో పేద ప్రజలకు నగదు, చెకక్కులు, నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టారు. మురికివాడ వాసులకు ఫ్లాటు నిర్మించి ఇస్తానని కూడా ఆయన వాగ్దానం చేశారు. బాబు భార్య తరన్నుం తన ఎన్నికల అఫిడవిట్‌లో తాను గృహిణినని, తనకుఆదాయం ఏమీ లేదని రాశారు. తన పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ. 40.50 లక్షలని ఆమె తెలిపారు.

అయితే..బాబు మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 46 కోట్ల ఆదాయాన్ని సంపాదించారు. తన స్థఙరాస్తుల విలువ రూ. 1,538 కోట్లు, చరాస్తుల విలువ రూ.83 కోట్లని బాబు ఇదివరకే ప్రకటించారు. చరాస్తులలో 2017లో రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారు కూడా ఉంది. తనకు రూ. 63 కోట్ల అప్పులు ఉన్నాయని, ఇవి గాక రూ. 13.43 కోట్ల ఐట బకాయిలు చెల్లించాల్సి ఉందని బాబు తెలిపారు. ఐటి బకాయిలపై తాను అప్పీలుకు వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. కర్నాటకలోని కోలార్ జిల్లాకు చెందిన కెజిఎఫ్ బాబు పేదరికం నుంచి అగర్భ శ్రీమంతుడిగా ఎదిగారు. 4వ తరగతి వరకు చదువుకున్న బాబు బెంగళూరులో రైల్వే స్క్రాప్ అమ్మి కోట్లకు పడగలెత్తారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి బాబును, ఆయన భార్యను ప్రశ్నించిది. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీ చేసి బాబు పోటమిపాలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News