Sunday, January 19, 2025

మంత్రి ఇళ్లపై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి సిహెచ్ మల్లారెడ్డి లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దా దాపు 50 టీమ్‌లుగా ఏర్పడి మల్లారెడ్డి నివాసం సహా ఆయన సంస్థలు, కార్యా లయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు పక్కనే ఉన్న మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, మ ల్లారెడ్డి వియ్యంకుడు మర్రి లకా్ష్మరెడ్డి నివాసంతో పా టు అదే ప్రాంతంలోని మంత్రి సోదరుడు గోపాల్‌రెడ్డి ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గుడ్లపోచంపల్లిలోని మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి నివాసంలో, కొంపల్లిలోని చిన్న కుమారుడు భద్రారెడ్డి నివాసంలో ఐటి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు కండ్లకోయలోని సిఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అధికారులు సోదాలు జరుపుతున్నారు.

సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రి, నారా యణ ఆసుపత్రి, మల్లారెడ్డి వైద్య కళాశాల, మల్లారెడ్డి డెంటల్ కాలేజీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కుటుంబసభ్యులు, బంధువులతో పాటు మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థల డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇళ్లల్లోనూ ఐటి దాడులు జరుగుతున్నాయి. మల్లారెడ్డి విశ్వవిద్యా లయానికి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మల్లారెడ్డి వైద్య, దంత కళాశాలతో పాటు ఆసుపత్రులకు మల్లారెడ్డి చిన్నకుమారుడైన భద్రారెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐటి తనిఖీల్లో నగదు, కీలక పత్రాలు స్వాధీనమయ్యాయి. తెల్లవారు జాము నుంచి గంటల తరబడిగా తనిఖీలు జరుపుతున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయా చోట్ల దస్త్రాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. మంత్రి ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన ఆస్తులు, ఆదాయ వనరులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో మంగళవారంనాడు ఉదయం నుండి ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

మంత్రి మల్లారెడ్డి ఫోన్‌ను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన నివాసం పక్కనే ఉన్న క్వార్టర్‌లో మల్లారెడ్డి పోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి సమక్షంలోనే ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో లాకర్లను ఐటి అధికారులు గుర్తించారు. లాకర్లను తెరిపిం చేందుకు ఓ వ్యక్తిని తీసుకువచ్చి లాకర్లను బద్దలు కొట్టారు. రెండు లాకర్లను ఆ వ్యక్తి తెరిచాడు. కాలేజీలు, రియల్ ఏస్టేట్ సంస్థ లకు మల్లారెడ్డి కొడుకు, అల్లుడు డైరెక్టర్‌గా ఉన్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు రియల్ ఏస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఐటి అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు, ఐటి రిటర్న్ చెల్లింపుల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఐటి సోదాల సంద ర్భంగా మంత్రి ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, కార్యాలయాల వద్ద సిఆర్‌పిఎఫ్ బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

మరోవైపు హైదరాబాద్ బాలానగర్‌లోని క్రాంతి బ్యాంక్ చైర్మన్ ఇంట్లోనూ ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కళా శాలతో సంబంధాలు న్నాయన్న సమాచారంతో బ్యాంకు చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల లావాదేవీలను ఐటి అధికారులు గుర్తించారు. సోదాల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డి సన్నిహితుల నుండి ఐటి అధికారులు భారీగా డబ్బు సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సుచిత్రలో మల్లారెడ్డి అనుచరుడైన త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లను సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి పలు కాలేజీలను నిర్వహిస్తున్నారని సమాచారం. సుచిత్రలో నివాసం ఉంటున్న త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ. 2 కోట్లు సీజ్ చేశారు అధికారులు. త్రిశూల్ రెడ్డి పలు కాలేజీలు ఉన్నట్టుగా ఐటి అధికారులు చెబుతున్నారు. నరసింహరెడ్డి కాలేజీల్లో త్రిశూల్ రెడ్డి డైరెక్టర్ గా కొనసాగు తున్నారు.

అంతే కాదు మంత్రి మల్లారెడ్డికి త్రిశూల్ రెడ్డి సమీప బంధువు. త్రిశూల్ రెడ్డికి చెందిన ఫోన్‌ను కూడా ఐటి అధికా రులు సీజ్ చేశారు. మంత్రి మల్లారెడ్డికి, త్రిశూల్ రెడ్డికి మధ్య సంబంధాలపై ఐటి అధికారులు ఆరా తీస్తున్నారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి అత్యంత సన్ని హితుడైన రఘునాథ్ రెడ్డి వద్ద రూ.2 కోట్లకు పైగా నగదును ఐటి అధికారులు స్వాధీనం చేసు కున్నారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో రఘు నాథ్ రెడ్డి నివాసం ఉంటున్నారు. రఘునాథ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి రూ.2 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేశారు. మరోవైపు, జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో మల్లారెడ్డికి వరుసకు అల్లుడు అయ్యే సంతోష్ రెడ్డి ఇంటికి కూడా ఐటీ అధికారులు వెళ్లారు. గంటల పాటు ఐటి అధికారులు వేచి చూశారు. మంగళవారం మధ్యాహ్నం అధికారులు తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేయడంతో సంతోష్‌రెడ్డి కుటుంబసభ్యులు ఇంటి తలుపులు తెరిచారు. తర్వాత అధికారులు సోదాలు చేపట్టారు. సంతోష్‌రెడ్డి నివాసంలో రెండు ఎలక్ట్రానిక్ లాకర్లను ఐటి అధికారులు గుర్తించారు.

మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. యూనివర్సిటీ నిర్వహణ ఆయనదే

మంత్రి మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. దూలపల్లి రోడ్‌లోని అశోక్ విల్లా నివాసంలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి అన్ని వ్యవహారాలు ప్రవీణ్‌రెడ్డి చూస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ తనిఖీల్లో మంత్రి మల్లారెడ్డికి భారీగా ఆస్తులు వున్నట్లు అధికారులు గుర్తించారు. యూనివర్సిటీ సహా 38 ఇంజనీరింగ్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు, ఇంకా దేవరాంజల్, షామీర్‌పేట, జవహర్‌నగర్, మేడ్చల్, ఘట్‌కేసర్, కీసరలో భారీగా ఆస్తులు వున్నట్లు గుర్తించారు. మల్లారెడ్డి విద్యాసంస్థల నగదు లావాదేవీలు ఓ బ్యాంకులో జరిగినట్లు ఐటి అధికారులు ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది.

మల్లారెడ్డికి మద్దతుగా కార్యకర్తల నినాదాలు

మరోవైపు ఐటి అధికారులు తనిఖీలు జరుగుతుండగా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మంత్రి మల్లారెడ్డి అభిమానులకు, మీడియాకు అభివాదం చేసి వెళ్లిపోయాడు. అయితే మల్లారెడ్డి నివాసానికి టిఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మల్లారెడ్డికి మద్దతుగా, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయంత్రం 6 గంటలకు మల్లారెడ్డి నివాసానికి చేరుకోవాలని ముందుగానే సమాచారమిచ్చుకున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కొత్త విషయాలు వెలుగులోకి…

మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుగుతున్న ఐటి సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. జైకిషన్, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తిం చారు. గతంలో కూడా జైకిషన్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాగస్వాములు అని గుర్తించారు. సిఎంఆర్ స్కూల్స్‌లో నరసింహయాదవ్, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు.

దీంతో నరసింహయాదవ్, జైకిషన్ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటి తనిఖీలు చేపట్టింది. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలి స్తున్నారు. కాగా, మల్కాజ్‌గిరి ఎంపి స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెల్చిన మల్లారెడ్డి తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరారు. పదో తర గతి వరకే చదువుకున్న ఆయన కొంతకాలం పాల వ్యాపారం చేశారు. కానీ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఆయనకు మించిన ధనవంతుడు లేడని స్థానికంగానే ఉన్న ప్రచారం. ఇప్పుడు ఐటి దాడులపై ఆయన ఎలా స్పందిస్తారో.. ఏం జరుగుతుందో… వేచి చూడాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News