Friday, November 22, 2024

ఎమ్మెల్యేలు వ్యాపారం చేయొద్దని రాజ్యాంగంలో ఉందా?: మర్రి జనార్దన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. ఐటి అధికారులు తన ఫోన్ స్వాధీనం చేసుకున్నారని మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. నిన్నటి నుంచి ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటి అధికారుల సోదాలకు పూర్తిగా సహకరిస్తున్నానని ఎమ్మెల్యే వెల్లడించారు.

ఎమ్మెల్యేలు వ్యాపారం చేయొద్దని రాజ్యాంగంలో ఉందా… వ్యాపారానికి తగిన పన్ను సక్రమంగా చెల్లిస్తున్నానని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 200 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి ఉంటానని తెలిపారు. బిఆర్‌ఎస్ నేతల ఇళ్లలో రెండు రోజు ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, ఎంపి ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో ఐటి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐటి సోదాల్లో 70 బృందాలు పాల్గొన్నాయి. మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ లోని నివాసానాకి చేరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News