Tuesday, December 24, 2024

ఎన్నికల ముందు బదనాం చేయడానికే ఐటి దాడులు: కొత్త ప్రభాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

దుబ్బాక : ఎన్నికల ముందు బిఆర్‌ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టేందుకే బిజెపి ఐటి దాడులు చేపిస్తుందని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన ఐటి దాడులపై ఆయన స్పందించి దుబ్బాకలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని నా ఇంటిపై దాడులు చేయడం కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. 1986 నుంచి నేను వ్యాపారం చేస్తున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు వైట్ పేపర్ మీదనే ప్రతి లెక్క ఉంటుందన్నారు. మీడియాలలో వచ్చేది ఒక రకంగా ఉంటే ఐటి అధికారులు మాట్లాడేది ఇంకోరకంగా ఉందన్నారు.

మంగళవారం పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి దుబ్బాకకు వచ్చానని ఈ నేపథ్యంలో ఐటి అధికారులు హైదరాబాద్‌లోని నా ఇంటిపై దాడులు చేశారన్నారు. నన్ను ఆయోమయానికి గురి చేయడానికే దాడులు తప్ప ఎలాంటి ఆదారాలు లేవన్నారు. ఎన్నికలలో ఇబ్బందులకు గురి చేయడానికే కుట్ర పన్నుతున్నారన్నారు. తాను మొదటి నుండి వంద శాతం ఐటి , జిఎస్టి, సిఎస్‌టి చెల్లిస్తానని స్పష్టం చేశారు. మేము చేసే టాన్స్‌ఫోర్ట్ వ్యాపారాలు అన్ని ఎంఎంసి కంపెనీలతో జరుగుతాయన్నారు.

ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లిస్తామన్నారు. తనకు ఉన్న ఆస్తులు ఆధారాలతో సహా ఐటి అధికారులకు చూపిస్తానన్నారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే చేస్తున్న ఐటి దాడులను ప్రజలు గమనించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News