హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి దంచికొట్టిన ఎండ సాయంత్రం వేళా ఒక్కసారి వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. గడిచినా 4 రోజులుగా నగరంలో సూర్యుడు తన ప్రతాపం చూపుతుండడంతో వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు శనివారం సాయంత్రం కురిసిన వర్షంతో కొంత ఉపశమనం లభించింది.
పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురువడంతో రోడ్లన్ని పూర్తిగా జలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రామచంద్రాపురం, లింగంపల్లి, సెంట్రల్ యూనివర్సీటీ, చందానగర్, మియాపూర్, మెహిదిపట్నం, విజయనగర్ కాలనీ, మాదాపూర్, హయత్‌నగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, సికింద్రాబాద్ , ఎల్‌బిస్టేడియం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నారాయణగూడ, అంబర్‌పేట్, నాగోల్, జియాగూడ, మణికొండ, గాజుల రామారం, వనస్థలిపురం, గౌలిగూడ, రామాంతాపూర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో మోస్తారు నుంచి చిరుజల్లులు పడ్డాయి.