- Advertisement -
హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ వేయాల్సిన తేదీ జులై 31. సకాలంలో ఫైలింగ్ చేయకపోతే జరిమానాలు పడతాయి. ఎంత ఆలస్యం ఫైల్ చేశారనే దానిపై ఆధారపడి ఆ జరిమానా ఉంటుంది. ఒకవేళ మీరు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వారు కానట్లయితే…మీకు టిడిఎస్ వంటి పన్ను రీఫండ్ జరగాలంటే ఐటిఆర్ ను సకాలంలో ఫైల్ చేయండి. సకాలంలో ఫైల్ చేయలేని వారు ఆలస్య రుసుముతో పన్ను రిటర్నును దాఖలు చేయవచ్చు. ఆలస్యంగా ఫైల్ చేసే వారికి చివరి తేదీ 31 డిసెంబర్ 2024. డిఫాల్ట్ అయ్యే వారకి రూ. 5000 పెనాల్టీ పడుతుంది. అయితే ఆదాయం రూ. 5000కు మించకపోతే రూ. 1000 గా ఉంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ పెనాల్టీ వడ్డీ పెరుగుతుంది కనుక సకాలంలో ఫైల్ చేయడం మంచిది. అలా చేస్తే నోటీసులు, స్క్రూటినీ ప్రొసీడింగ్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
- Advertisement -