Thursday, January 23, 2025

ముగిసిన ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ :  అధికార పార్టీ ఎంఎల్‌ఏ పైళ్ళ శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు సోమవారం ముగిశాయి. గత మూడు రోజులుగా ఎంఎల్‌ఏ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంఎల్‌ఏ ఫైళ్ళ శేఖర్‌రెడ్డికి సంబంధించిన కంపెనీలు వాటికి సంబంధించిన ఆడిటర్లు వారి ఆర్దిక లావాదేవాలపై ఐటి దృష్టి సారించింది. ఎంఎల్‌ఎకు చెందిన కంపెనీలు , వ్యాపార వ్యహరాలు, వారు చెల్లిస్తోన్న పన్నులకు మధ్య వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

తీర్థా గ్రూప్ డైరక్టర్‌గా ఉన్న వనితారెడ్డి బంధువుల ఇళ్ళల్లో కూడా సోదాలు జరిపి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఎంఎల్‌ఏలకు సంబంధించి హైదరాబాద్, బెంగుళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలు గుర్తించినట్లు తెలిసింది. అంతే కాకుండా వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించినట్లు తెలిసింది.మూడు రోజుల క్రితం మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంఎల్‌ఏలు ఫైళ్ళశేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డిలకు చెందిన నివాసాలు, వ్యాపారాలు,షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వరుసగా బిఆర్‌ఎస్ నేతల ఇళ్ళల్లో ఒకేసారి ఐటిశాఖ సోదాలు నిర్వహించడంతో బిఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది, వ్యాపారాలు, నిర్వహిస్తున్న నేతల టార్గెట్‌గా సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News